రీల్స్ కోసం యువత పిచ్చి వేషాలు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై 8 మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్ లు చేస్తున్నారు…

ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు యువకులు ప్రయాణిస్తున్న ప్రమాదకర రీతిని వీడియో తీసి ట్విట్టర్ లో సోషల్ మీడియా లో,శంషాబాద్ డిసిపి కి ఫిర్యాదు చేశారు…

ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఓకే ద్విచక్ర వాహనంపై ప్రమాదకర రీతిలో ప్రయాణించిన 8 మంది యువకులను అదుపులకు తీసుకొని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు…

కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

వీరిలో కొంత మంది మైనర్ లు ఉన్నట్లుగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిఐ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!