శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వ్యాన్ విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఘటనలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
కరీంనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వ్యాన్ (నంబర్: AP15TD2268) చెంజర్ల గ్రామ పరిసర రోడ్డులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా స్టీరింగ్ రాడ్ విరగడం వల్ల వాహనం అదుపు తప్పింది.
డ్రైవర్ చాకచక్యంగా స్పందించి వాహనాన్ని ఆపడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
వాహనంలో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలు భయపడ్డప్పటికీ, ఎటువంటి గాయాలు జరగలేదు.
ప్రమాదం జరిగిన తర్వాత గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయం అందించారు.
స్థానికులు మాట్లాడుతూ ఇలాంటి పాత వాహనాలను ప్రతిరోజూ తనిఖీ చేయాలని అన్నారు. పిల్లల భద్రతకు స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఇట్టి విషయంపై స్కూల్ యాజమాన్యాన్ని ఫోన్లో సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
