తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.
ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది.
మొదట అందరూ.. దీనిని సాధారణ యాక్సిడెంట్‌గానే భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
మొదట అందరూ యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడని అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం యాక్సిడెంట్ అయిన తీరుపై అనుమానం రావడంతో కారు నంబర్ ఆధారంగా విచారణ చెప్పట్టారు.
ఒక కారుని రెంట్‌కు తీసుకుని భర్త స్వామిని చంపించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో కారు డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగా మృతుడు సామి భార్యను విచారిస్తే తానే పథకం ప్రకారం సూపారీ ఇచ్చి భార్తను చంపించినట్లు విచారణలో ఒప్పుకుంది.
తన అక్రమసంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే తన తమ్ముడితో కలిసి భర్తను చంపించినట్లు విచారణలో తేలింది.
ప్లాన్‌లో భార్యతో పాటు మృతుడి బావమరిది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
#Crime#CrimeNews#wifekilledhusband#Women#Telangana#hyderabad#accident#illegalActivities