బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన సాంకేతిక కమిటీ

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది

ఇన్లెట్ వైపు నుండి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని డీబీఎం (డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్ మెథడ్) లోనే తవ్వకాలు జరపాలని, కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ శాఖ జారీ చేసిన అనుమతులకు లోబడి పనులు కొనసాగించాలని సూచించిన కమిటీ

సొరంగంలో చిక్కుకున్న వారి కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఇన్ఐఆర్ఎం) సహాయం తీసుకోవాలని, ప్రమాద జోన్లో ఉన్న 50 మీటర్లపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ద్వారా సమగ్ర సర్వే చేయించాలని సూచించిన కమిటీ

ఈ నెల 30వ తేదీలోగా టన్నెల్లో భూసాంకేతిక (జియో టెక్నికల్) పరీక్షలు, జూన్ 30వ తేదీలోగా సమగ్ర సర్వే, ఆగస్టు నెల కల్లా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ

డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్ పద్ధతికి అయ్యే ఖర్చు అంచనా వేయాలని, మిగతా పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో నిర్మాణ సంస్థ (జయప్రకాష్ అసోసియేట్స్) నుంచి ప్రణాళిక తీసుకోవాలని సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!