తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.
అయితే, మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరా బాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే మూడు రోజులు శని, ఆది, సోమవారం,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రెండు రోజులుగా ఏకధా టిగా వర్షం కురుస్తుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
శుక్రవారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే, సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిం చింది.బుధ, గురువారాల్లో కురిసిన వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.
అయితే, వర్షాల నేపథ్యం లో జీహెచ్ఎంసీ అధికారు లు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి, డ్రైనేజీ, వరద ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుం టున్నట్లు అధికారులు తెలిపారు.
నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమ య్యారు. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్ సాగర్ గండిపేట, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1789.95 అడుగులకు చేరింది. జలాశయానికి గురువారం సాయంత్రానికి 900 క్యూసెక్కులు చేరుతుండ గా.. ఎనిమిది గేట్లు ఎత్తి 2704 క్యూసెక్కులను మూసీలోకి వదులుతు న్నారు.