మా బాబు ప్రాణాన్ని కాపాడండి !

ఏడు నెలల బాబుకు గుండె సంబంధిత జబ్బు..

ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజావాణిలో కలెక్టరు వినతి..

పుట్టుకతోనే గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతుండగా.. ఏడు నెలల శిశువుకు ఫేస్ మేకర్ చికిత్స చేయాలంటే రూ. 8 లక్షలు కావాల్సి ఉండగా తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే బాబు చికిత్సకు అప్పులు చేసి రూ. 11 లక్షల దాకా ఖర్చుచేశామని, ఆర్థికంగా సాయం అందించి తమ బాబు ప్రాణాలు కాపాడాలని తల్లితండ్రు లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలిసి వినతి పత్రం అందించారు. వివరాల్లోకి వెళ్తే..

మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన రామగిరి శ్వేత, అంజయ్య దంపతులకు ఏడు నెలల కింద బాబు శ్రీవాగ్మిన్ అవ్యక్త ఠాకూర్ జన్మించాడు. శిశువు పుట్టిన ప్పటి నుంచి గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతుండగా.. ఇప్పటికే వైద్యానికి అప్పులు చేశారు. ఇంకా ఖర్చు భరించే స్థోమత లేక నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తే.. అక్కడ 7 నెలల శిశువుకు ఫేస్ మేకర్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీ లేదని చెప్పారు. ఇలాంటి చికిత్సకు ఆరోగ్య శ్రీ వర్తించదు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించగా.. ఫేస్ మేకర్ చికిత్స చేయాలని సూచించారు. రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖర్చు భరించలేమని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఇంకా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా సాయం అందించి తమ కొడుకుకు ప్రాణభి క్ష పెట్టాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఎవరైనా ఆర్థికసాయం అందించాలనుకుంటే..

ఫోన్ 9573875479 నంబర్ లోసంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!