ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ MMTS ట్రైన్‌లో నిన్న యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు

సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
జంగం మహేశ్ మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసుగు గుర్తించారు. ఏడాది క్రితమే మహేశ్ ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటిరిగా ఉంటున్నాడు. మహేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించిన యువతి దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు