HCU భూముల అంశంలో విద్యార్థులు, ప్రజలు,ప్రముఖులు స్పందించిన తర్వాత BRS వారికి అండగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తామేమి సారథ్యం వహించలేదని.. ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డామని చెప్పారు. విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం కేవలం విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తే సరిపోదు. అక్కడి అడవికి, వన్యప్రాణుల మరణాలకు కారణమైన వారిపైన కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
HCU ఉద్యమానికి సారథ్యం వహించలేదు.. అండగా నిలబడ్డాం: KTR
