అశోక్ గజపతిరాజుకు కంగ్రాట్స్ చెప్పిన సీఎం చంద్రబాబు

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు

ఏపీ ప్రజలకు గర్వకారణమన్న సీఎం చంద్రబాబు

అశోక్ గజపతిరాజు గవర్నర్ గా విజయవంతం అవ్వాలంటూ ట్వీట్

పూసపాటి రాజకుటుంబీకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

“గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర క్యాబినెట్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు గారు విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!