భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు?

భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు? ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయి?

భారతదేశంలో చిన్నపిల్లలను అక్రమంగా ఉద్యోగాల‌్లో పెట్టి, వారిని ఎక్కడి నుంచో దొంగతనంగా తీసుకువచ్చి, ఆహారం ఇచ్చి వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. పిల్లలు అదృశ్యమవడం జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య కూడా మారింది. వారిని కిడ్నాప్‌ చేసి వారిని అక్రమంగా తరలించి, బాల కార్మికులుగా, వేశ్యావృత్తి, ఇతరుల ఇళ్లలో పని చేయడానికి బలవంతం చేస్తున్నారు.

ఇందులో ఎక్కువగా పేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని ఉద్దేశపూర్వకంగా గాయపరచి, వికలాంగులుగా చేసి భిక్షాటన చేయించడం సర్వసాధారణం అయిపపోయింది. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా విడాకుల కేసుల‌లో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి చిన్న వయసులోనే ఏదైనా చేయాలనే కల వారిని నేరం లేదా తప్పుడు పనులలోకి నడిపిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి పిల్లలు అదృశ్యమవుతున్నారో ఇక్కడ చూద్దాం.

మధ్యప్రదేశ్

మహిళా, అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు మొత్తం 2,75,125 మంది పిల్లలు అదృశ్యమయ్యారని పేర్కొంది. వీరిలో 62,237 మంది బాలురు, 2,12,825 మంది బాలికలు ఉన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 61,102 మంది పిల్లలు మధ్యప్రదేశ్ నుంచి అదృశ్యమయ్యారు, వీరిలో 49,024 మంది బాలికలు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్

మధ్యప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 49,129 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 41,808 మంది బాలికలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైన పిల్లలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి, వారిని వివిధ రకాల పనులు చేయిస్తున్నారు.

కర్ణాటక

మూడో స్థానంలో దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటక ఉంది. మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలో, జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు కర్ణాటకలో 27,528 మంది పిల్లలు అదృశ్యమయ్యారని తెలిపారు, వీరిలో 18,893 మంది బాలికలు ఉన్నారు.

గుజరాత్

అత్యధికంగా పిల్లలు అదృశ్యమైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉంది. నివేదిక ప్రకారం, గుజరాత్‌లో 20,081 మంది పిల్లలు అదృశ్యమయ్యారు, వీరిలో 16,432 మంది బాలికలు ఉన్నారు.

ఢిల్లీ

ఈ జాబితాలో చివరి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఢిల్లీలో జనవరి 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు 22,964 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వీరిలో 15,365 మంది బాలికలు ఉన్నారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటీ?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి టాప్ మిస్సింగ్ జాబితా ఎక్కువగానే ఉంది. తెలంగాణ మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక్కడ రికవరీ రేటు ఎక్కువగా కనిపిస్తోంది.

తెలంగాణలో దాదాపు పదివేల మంది మిస్ అయ్యారు. 2022లోనే దాదాపు 3443 మంది మిస్సయ్యారు. మొత్తంగా ఇంకా నాలుగువేలకుపైగా కేసులు పెండింగ్‌ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటులో మాత్రం తెలంగాణలో టాప్‌లో ఉంది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు 3000-3500 మంది మిస్ అయ్యారు. ఇందులో దాదాపు ౩వేల వరకు కేసులు ట్రేస్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!