ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫిక్స్..!!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్వినియోగించనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్, బ్యాలెట్పేపర్, బ్యాలెట్బాక్సులు, స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది….
