
సెలవు.. ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా
దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటినుంచి మన ఇళ్లకు దగ్గరలోనో, వీధి చివర్ల లోనో,పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానం తో ఎదురు చూసిన నెచ్చెలి. ప్రేమలు ఆత్మీయత తో కూడిన వార్తలు మోసుకొస్తూ, తీసుకు వెళ్తూ సంధాన కర్తగా, సేవలు అందించిన స్నేహశీలి . ఆశల కబుర్లు మోసుకు వచ్చి మనస్సుల్లో సంతోషాల పంచిన మిత్రుడు నేను ఇక కనిపించను…