
తెలంగాణకు అన్యాయం.. జరగనివ్వం బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్..!!
హైదరాబాద్,ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయంలో…