మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!
సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు. బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత,…
