రాజాసింగ్‌కు అర్థమవుతున్న రాజకీయం !

బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు….

Read More

ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు: హరీష్..!!

గజ్వేల్: “తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రెండేళ్లలోనే ఆగమాగమైంది. పాలన చేతగాక, దిక్కుమాలిన మాటలు చెబుతూ, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు” అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజ్ఞాపూర్‌లోని ఎస్ఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ”సర్వేల్లో బీఆర్ఎస్‌దే పైచేయి.. అతివిశ్వాసం వద్దు” “ఇటీవల నిర్వహించిన సర్వేల…

Read More

బీజేపీ వైపు మల్లారెడ్డి ఫ్యామిలీ ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చురుకుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమెకు చాలా రాజకీయ ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో…

Read More

కొత్త సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారుు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు…

Read More

తెలంగాణ బీజేపీలో అగ్ని పరీక్ష: ఈటలపై కుట్రలు?

తెలంగాణ బీజేపీలో భిన్న స్వరాలు, అంతర్గత పోటీలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ లోపలే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఈటల తీవ్రస్థాయిలో ఆరోపించారు. “బీ కేర్‌ఫుల్ కొడకా… నేను శత్రువుతో పోరాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను” అంటూ ఎవరైనా తనను టార్గెట్ చేస్తే సహించేది లేదన్న స్పష్టం చేశారు. ఈటల వ్యాఖ్యలు చూస్తే, తనను పార్టీ నుంచి బయటకు నెట్టి వేయాలనే కుట్రలు సాగుతున్నట్లు…

Read More

బీటెక్ సీట్లు ఫస్ట్ ఫేజ్‌లోనే 93 శాతం భర్తీ..!!

రాష్ట్రవ్యాప్తంగా 77,561 మందికి అలాట్‌మెంట్అత్యధికంగా సీఎస్‌ఈలో 57,042 సీట్లు నిండినయ్82 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీవిద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు ఈ నెల 22 వరకు చాన్స్‌ హైదరాబాద్, రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. టీజీ ఎప్ సెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే 93.3 శాతం భర్తీ అయ్యాయి. ఈ వివరాలను శుక్రవారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 172 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో…

Read More

ట్రాఫిక్ సమస్యలకు చెక్‌.. హైదరాబాద్‌లోకి జిల్లాల బస్సులు రాకుండా కొత్త బస్ టర్మినల్

హైదరాబాద్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకల కోసం కొత్త బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నగర రద్దీ తగ్గి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది. హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులన్నీ నగర కేంద్రంలోని ఎంజీబీఎస్‌ కు చేరడానికి ట్రాఫిక్…

Read More

హీటెక్కిన ఓల్డ్ సిటీ…..మాధవి లత vs రాజాసింగ్

బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. మొన్నటి ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి కరుడు గట్టిన హిందుత్వవాదిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ పెద్దలు ఆయన ఎపిసోడ్ పై మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా తాజాగా రాజాసింగ్ పై అదే పార్టీ నేత…

Read More

కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ASIP, మైక్రో LED ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే పరిశోధనా సౌకర్యాలతో, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ…

Read More

కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్‌చాట్‌లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని.. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి…

Read More
error: Content is protected !!