
మహా నగరంలో మహా సముద్రం
రోజురోజుకి పెరుగుతున్న హైదరాబాదీ కష్టాలు అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ మహానగరం వ్యవస్థ భారీ వర్షాలతో సకాలంలో డ్యూటీలకు హాజరుకాలేకపోతున్న ఉద్యోగులు హైదరాబాద్.. కలల మహానగరం, అవకాశాలకు నిలయం. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ మహానగరం ముసుగు తొలగిపోతుంది. ఆకాశం కరుణ లేకుండా కుండపోతగా కురిసిన వర్షాలకు, రోడ్లు నదుల్లా మారిపోతాయి, కాలనీలు చెరువుల్లా కనిపిస్తాయి. కొన్ని గంటల పాటు కురిసే ఈ వర్షాలు హైదరాబాద్ ప్రజలకు భయాన్ని, నిస్సహాయతను మిగుల్చుతున్నాయి. ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే…