తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు?

తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. అయితే, మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్…

Read More

నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంక్ లకు కుచ్చుటోపి…!!

కురవిలో పట్టుబడిన నకిలీ పాస్ పుస్తకాల ముఠా.‌.. పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు… కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పాస్ పుస్తకాలతో లోన్ లు కాజేస్తూ బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తీగలాగితే మరింత అవినీతి డొంక కదులుతుందని, అరెస్ట్ అయిన ముగ్గురే కాకుండా మరికొందరు పాత్రధారులు, సూత్రదారులు బయటకు వస్తారంటున్నారు ప్రజలు.. కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ..అక్రమవ్యవహారానికి…

Read More

ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్.. తెలంగాణ రాష్ట్రంలో.. కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్,…

Read More

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు!

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి,మీదుగా…

Read More

నా చావుకు కారణం ఆ ముగ్గురే..మైనర్ బాలిక ఆత్మ*హత్య..!!

నా చావుకు కారణం ఆ ముగ్గురే..మైనర్ బాలిక ఆత్మహత్య..!! మైనర్ బాలికను కత్తులతో బెదిరించి..లైంగిక దాడి చేసి..వీడియోలు చిత్రీకరించి వేధించిన ముగ్గురు మానవ మృగాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి తమ కూతురు రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో, ఆమె ఫోనులో ఉన్న వీడియోలు, ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి…

Read More

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో :కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా…

Read More

బీఆర్ఎస్ మద్దతు బీజేపీ అడగలేదా ?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జగన్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారని వైసీపీ వర్గాలు ప్రకటించుకున్నాయి. బీజేపీ వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో ఐదుగురు సభ్యులు వైసీపీకి ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు.. భారత రాష్ట్ర సమితిని సంప్రదించలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇండియా కూటమితో సంబంధం లేని పార్టీలు, బీజేపీకి పరోక్షంగా అయినా మద్దతు పలుకుతున్న పార్టీలకు మరో దారి లేదు. అడిగినా అడగకపోయినా…

Read More

వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది. వచ్చె నెల అనగా సెప్టెంబర్ నుండి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ బ్యాగులను ఇవ్వనుంది. ఈ బ్యాగుల్లో సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉంటాయని…

Read More

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద 26.3 అడుగులకు చేరిన నీటిమట్టం భద్రాచలం: మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది….

Read More

13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు

హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్ లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాళ్టి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు. ఇంతకుముందు, నిర్మాతలు పెట్టిన మొత్తం…

Read More
error: Content is protected !!