
వాన.. వాన.. లేదప్పా?..ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం
అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు….వర్షాకాలంలో మండుతున్న ఎండలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత… నైరుతి రుతుపవనాల మందగమనం..గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం…అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన…