
4 వేల టన్నుల బొగ్గు మాయం.. మేఘాలయ మంత్రి వింత వివరణ
గనులలో నుంచి వెలికి తీసి డిపోలలో నిల్వ చేసిన బొగ్గు మాయమైంది. ఏకంగా 4 వేల టన్నుల బొగ్గు అటు డిపోలలో లేదు.. ఇటు అమ్మకాల లెక్కల్లోనూ కనిపించడంలేదు. మేఘాలయలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, బొగ్గు మాయం కావడమే వింత అనుకుంటే దీనిపై ఆ రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింతల్లోకెల్లా వింతగా మారింది. డిపోలలో నిల్వ చేసిన బొగ్గు వర్షాలకు కొట్టుకుపోయిందని మంత్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం మేఘాలయలో చర్చనీయాంశంగా మారింది. ఏంజరిగింది.. రాజాజు, దియంగన్ గ్రామాల్లోని…