
జపాన్, భారత్ కలిస్తే అద్భుతాలే: టోక్యోలో మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ… టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… “ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే…