నటుడు లోబోకు బిగ్ షాక్..

నటుడు లోబోకు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. 2108లో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప, లక్నవరం భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు. చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం…

Read More

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. హైదరాబాద్ కు బయల్దేరుతున్న చంద్రబాబు

ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత హైదరాబాద్‌ ఫిలింనగర్‌ నివాసంలో తుది శ్వాస దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు జయకృష్ణ నివాసానికి చేరుకుంటున్న నందమూరి కుటుంబం నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు…

Read More

LICలో 841 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30Yrs ఉండాలి. పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.£ https://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

Read More

13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు

హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్ లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాళ్టి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు. ఇంతకుముందు, నిర్మాతలు పెట్టిన మొత్తం…

Read More

తెరపైన హీరో.. తెర వెనక దేవుడు

విద్యతో వెలుగులు నింపుతున్న అగరం ఫౌండేషన్ హీరో అంటే నటించేవాడు కాదు, నడిపించేవాడు హీరో సూర్య జీవితం ఒక స్ఫూర్తి ఒక మనిషి తెరపై మెరుస్తున్న హీరోగా వెలిగిపోవడానికి కేవలం ఒక సినిమా చాలు. కానీ, అదే మనిషి నిజ జీవితంలో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలవాలంటే, అది కేవలం అతడిలోని మానవత్వం, మంచి మనసుతోనే సాధ్యం. సినీ నటుడు సూర్య ఈ రెండింటికీ సజీవ ఉదాహరణ. తెరపై అతడు ఓ పవర్ ఫుల్ హీరో పాత్రలో…

Read More

రైతుకు మద్దతేది?

అందరికీ అన్నం పెట్టేవాడే రైతు.ఇప్పుడు ఆ రైతే కనపడని స్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి.అతివృష్టి,అనావృష్టిలతో యుద్ధం చేస్తూ నాగలి పట్టిన రైతన్నకు పాలకులు తోడ్పాటు ఏ రకంగానూ ఉండటం లేదు. ప్రత్యామ్నాయ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు తప్ప వ్యవసాయం పైనే ఆధారపడాలంటే చావే శరణ్యమన్న ఆలోచనకు పురికొల్పే విధానాలు ఎక్కువయ్యాయి.శక్తినంతా ధారపోసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతుది తప్పా?.. ‘అదంతా మాకు సంబంధం లేదు మేం ప్రకటించిన మద్దతు ధరతో పంటలు అమ్ముకోండి,లేకపోతే మీ చావు మీరు చావండి’అంటున్న కేంద్ర…

Read More

గవర్నర్‌కు జగన్ చేసుకున్న విన్నపాలేంటి?

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి గంట సేపు సమావేశం అయ్యారు. అంత సేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే చాన్స్ లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కు గంట…

Read More

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం?

జార్ఖండ్‌లోని డియోఘర్‌, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మోహన్‌ పూర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్ట డంతో ఈ ప్రమాదం జరి గిందని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి…

Read More

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం!

హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “నిమిషా ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు” అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నిమిష ప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయిందని ఇండియా గ్రాండ్ ముఫ్తీ కంథాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. “నిమిష ప్రియ మరణశిక్ష ఇంతకు ముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఇప్పుడు…

Read More

హోటల్‌లో మంత్రిగారి రాసలీలలు లీక్

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ లగ్జరీ హోటల్ చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రులతో సహా 72 మంది సీనియర్ అధికారులు చిక్కుకున్నారని ఓ రాజకీయ నాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణలు నిజమని తేలింది. నాసిక్, ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో ఒక మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు,…

Read More
error: Content is protected !!