కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ASIP, మైక్రో LED ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే పరిశోధనా సౌకర్యాలతో, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ…

Read More

38 రోజుల పసికందును వేడి నీటిలో మరిగించి చంపిన కన్నతల్లి

ప్రసవానంతర డిప్రెషన్‌ (PPD) కారణంగానే ఈ విషాదమన్న పోలీసులుకర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని కదిలించే అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 38 రోజుల పసికందు హత్య కేసులో వెలుగుచూస్తున్న వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (PPD) మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒక తల్లి తన 38 రోజుల పసికందును మరిగించిన నీటిలో వేసి దారుణంగా చంపిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతే కాకుండా ప్రసవానంతర డిప్రెషన్ తీవ్రత,…

Read More

వాన.. వాన.. లేదప్పా?..ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం

అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు….వర్షాకాలంలో మండుతున్న ఎండలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత… నైరుతి రుతుపవనాల మందగమనం..గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం…అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన…

Read More

71 జీపీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో తగ్గిన 44 స్థానాలు

31 జెడ్​పీలు, 566 ఎంపీపీలు, అంతే సంఖ్యలో జెడ్​పీటీసీలు తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుచేయాలి. అయితే, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు శాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. అంతకు ముందు 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు తగ్గింది. గతం కంటే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ…

Read More

మ‌రోసారి ప‌వన్ క‌ళ్యాణ్‌ని ప్ర‌శ్నించిన ప్ర‌కాశ్ రాజ్..

జనసేన అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ముందుండే వ్యక్తిగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. పవన్ గతంలో కమ్యూనిస్టు భావజాలాన్ని పట్టుకొని, చేగువేరాను ఆదర్శంగా కొనియాడితే… ఇప్పుడు సనాతన ధర్మం విలువలు చెబుతూ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా మారారు. ఈ మార్పుపై ప్రకాశ్ రాజ్ ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో జనసేన ఆవిర్భావ సభలో పవన్…

Read More

నకిలీ అమెజాన్ సపోర్ట్ నంబర్‌కు డయల్ చేసి ₹1,07,621 పోగొట్టుకున్న సికింద్రాబాద్ మహిళ

సికింద్రాబాద్‌కు చెందిన 60 ఏళ్ల మహిళ అమెజాన్ రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లో దొరికిన మోసపూరిత కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేసిన తర్వాత ఆన్‌లైన్ స్కామ్ బాధితురాలైంది. అమెజాన్ సపోర్ట్ ఏజెంట్‌గా నటిస్తూ స్కామర్ ఆమె పరికరానికి రిమోట్ యాక్సెస్ పొంది, సున్నితమైన బ్యాంకింగ్ వివరాలను పంచుకోవాలని ఆమెను ఒప్పించాడు. ఆ తర్వాత మోసగాడు ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఖాతాల నుండి ₹1,07,621 బదిలీ చేశాడు. బాధితురాలు ఈ సంఘటనను…

Read More

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల విస్తరణ:మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…

Read More

భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి…

Read More

అతనికి 25 ఏళ్ళు.. ఆమెకు 35 ఏళ్ళు

ప్రియుడు పట్టించుకోవడం లేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత నేరేడుచర్ల మండలం బోడల దిన్న గ్రామానికి చెందిన వివాహిత అశ్విని(35) తన భర్త శ్రీనివాస్ రెడ్డి, కూతురుతో ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అదే గ్రామానికి చెందిన కందుకూరు సురేష్ రెడ్డి (25) అనే యువకుడితో అశ్విని వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు రావడంతో సురేష్ రెడ్డి, అశ్వినిని దూరం పెట్టాడు దీంతో మనస్థాపానికి గురైన అశ్విని వీడియో కాల్ చేసి…

Read More

ఎస్సై రాణా ప్రతాప్ భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య.!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ప్రస్తుత జిఆర్పి ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మ హత్య! వివాదస్పదం అయింది. తమ కూతురిని ఎస్సైతో సహా ఆయన కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని మృతురాలి తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన రాణా ప్రతాప్ ది ఉద్యోగం వచ్చినప్పటినుండి దురుసుగా వ్యవహరించి పలు మార్లు శాఖ పరమైన చర్యలు తీసుకొన్నారు. గత ఆరు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలో…

Read More
error: Content is protected !!