
భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!
రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…