
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల విస్తరణ:మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…