ఓ పిల్లాడు ఉద్దేశపూర్వకంగా కారు అద్దాలు రాయితో కొట్టి పగలగొట్టాడని పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తే.. మరో కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో తలదూర్చి ఏకంగా బాధితుడినే దబాయించి బెదిరిస్తున్న వైనం ఇది. ఈనెల 25వ తేదీన షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయనగర్ కాలనీకి చెందిన వెంకటేష్ చారి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
తన షిఫ్ట్ కార్ నంబర్ ఏపీ 09 సీఎన్ 5744 వెనక సైడ్ అద్దాన్ని ఓ బాలుడు రైతు కొట్టి పగలగొట్టాడు. ఈ విషయంలో బాధితుడు వెంకటేష్ చారి ఆ బాలుడి తల్లిదండ్రులకు తనకు జరిగిన నష్టాన్ని వివరించాడు. తర్వాత మాట్లాడతామని చెప్పిన ఆ బాలుడి తల్లిదండ్రులు ఆ తరువాత ఏం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు గత్యంతరం లేక పోలీస్ స్టేషన్లో జరిగిన విషయమై ఫిర్యాదు చేశాడు. ఇక్కడ కథ మొదలైంది.
హలో బ్రదర్ నేను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నా.. అంటూ
గాంధీ అనే కానిస్టేబుల్ (ఈ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వారు కాదు) బాధితుడికి ఫోన్లు చేసి ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని దవాయించాడు. తను ఇదే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నట్టుగా బాధితుడికి చెప్పాడు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో గాంధీ గురించి వాకబు చేయగా అతను ఇక్కడ పనిచేసే వెళ్లాడని ఇక్కడ పోలీస్ స్టేషన్ అతనిది కాదని చెప్పారని బాధితుడు పేర్కొన్నారు. కానిస్టేబుల్ గాంధీ అనే వ్యక్తి మరోసారి ఫోన్ చేసి తనను
దబాయించాడని నీకు ఎవరికి తెలుసు వారిని పోలీస్ స్టేషన్కు తీసుకురా చూసుకుంటా అన్నట్లు దబాయించాడని బాధితుడు వెంకటేష్ చారి పేర్కొంటున్నాడు. తన కారు అద్దం పగలగొట్టి తనకు నష్టం చేకూర్చిన వారిపై చర్యల కోసం చట్టాన్ని ఆశ్రయిస్తే కానిస్టేబుల్ తనను బెదిరించడం ఏమిటని అతను మధ్యలో తల దూర్చడం ఎందుకని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. బాలుడు పగలగొట్టిన అద్దం విషయంలో తల్లిదండ్రులు చొరవ తీసుకొని పరిష్కరించుకుంటే అయిపోయే విషయాన్ని కానిస్టేబుల్ కు చెప్పి బాధితులను ఉల్టా బెదిరించడం ఇంతవరకు సమంజసం అర్థం కాదు అదేవిధంగా స్థానిక పోలీసులు దీనిపై చర్య తీసుకోకుండా గాంధీ చెప్పాడను లేక తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాడనీ మతలబులు చేయడం వల్ల పోలీస్ శాఖ అభసపాలు అయ్యే అవకాశం ఉంది. బాధితుడు కానిస్టేబుల్ గాంధీ బెదిరింపులపై స్థానిక పోలీసులకు వివరించినట్లు తెలిపారు. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటాలో చూద్దాం మరి.. ?! స్థానిక కానిస్టేబుల్ గా పరిచయం చేసుకుని బెదిరించిన వైనంపై ఇక్కడి పోలీసులు కూడా ఏ విధంగా అతనిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం బాధితుడిని కానిస్టేబుల్ బెదిరించిన ఆడియోలో దుబాయింపు బెదిరింపు వివరాలు ఉన్నాయి
కారు అద్దం పగలగొట్టారని కంప్లైంట్ ఇస్తే మధ్యలో తల దూర్చిన మరో కానిస్టేబుల్
