సూర్యాపేట జిల్లాలో భారీ ఏటీఎం చోరీ జరిగింది జిల్లాలోని హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు తెలిసింది.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..
హుజూర్ నగర్ పట్టణం లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ బ్యాంక్ సంబం ధించిన ఏటీఎం దగ్గర ఆదివారం అర్ధరాత్రి 2-30 గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు ఫార్చు నర్ కారులో అనుమానాస్ప దంగా కనిపిస్తున్నారని ఒక లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.
వెంటనే పోలీస్ సిబ్బంది సమయానికి అక్కడికి వెళ్లేసరికి అక్కడి నుంచి దుండగులు పరారైనట్లు తెలిపారు. అప్పటికే గ్యాస్ కట్టర్లతో వచ్చి అందులోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలించి వెళ్లారని గ్యాస్ కట్టర్ తో కట్ చేసే సమయంలో కొంత నగదు కూడా కాలిపోయిం దని తెలిపారు.
వెంటనే ఫైర్ సిబ్బందిని అధికారులు పిలిపించి మంటలు అర్పించామని తెలిపారు. అందులో సుమారు 20 లక్షల వరకు నగదు ఉండవచ్చునని తెలుస్తుంది. అందులో ఎంత నగదు ఉన్నది అనేది బ్యాంకు సంబంధించిన అధికారులు తెలియజేయా ల్సి ఉంది.