
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలోకిసాన్ మోర్చా నాయకులు, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూరైతు ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు. ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని, నేటికీ జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం రైతులు కాళ్ళ అరిగేలా సంబంధిత కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని గోసపెడుతుందన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన
రైతాంగాన్ని ఆదుకోవాలని , రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలలో రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇట్టి నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధానంగా ఆరూ గ్యారంటీలు, 420 హామీలు, అడ్డగోలు వాగ్దానాలతో ప్రజలను నయవంచన గురి చేసిందన్నారు. అన్నం పెట్టే రైతన్నను కూడా తీవ్రంగా మోసం చేసిందన్నారు. రుణమాఫీ పై అనేక ఆంక్షలు, కోర్రిలు, నిబంధనలు పెట్టి రైతాంగాన్ని ఏడిపిస్తుందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల పై రుణం ఉన్నవారికి, రుణమాఫీ వర్తించదని ప్రకటన చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని, నేడు కొందరికే రుణమాఫీ చేస్తూ రైతులను కాంగ్రెస్ సర్కార్ నట్టేట మోసం చేసిందని ఆయన ఈ సందర్భంగా మండివడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి లతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.