నటుడు లోబోకు బిగ్ షాక్..
ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు
సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. 2108లో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప, లక్నవరం భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు.
చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారు డ్రైైవ్ చేస్తూ.. వస్తుండగా.. ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతిచెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు విచారించిన జనగామ కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్ష.. రూ.12,500 జరిమానా విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.
అయితే లోబో.. టాటూ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్‌కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి, యాంకర్‌గా సత్తా చాటారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో తన కామెడీ, వ్యవహార శైలితో అందరినీ అకట్టుకుని ప్రక్షకులకు మరింత సుపరిచితుడిగా లోబో మారిపోయాడు..