కురవిలో పట్టుబడిన నకిలీ పాస్ పుస్తకాల ముఠా...
పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు…
- ముగ్గురు అరెస్ట్..!! మరికొందరిపైన అనుమానాలు..??!!
- కొందరు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపణలు..??
- కురవి యూనియన్ బ్యాంక్ లో ఒక్కటి కాదు…, పదుల సంఖ్యలో నకిలీలోన్ లు ఉండి ఉండవచ్చు గుసగుసలు..??!!
- ఆనవాళ్లు దొరికిన అన్ని బ్యాంకుల పైన సమగ్రవిచారణ జరపాలని, తీగలాగి.., బాగోతం బట్టబయలు చేయాలంటున్న ప్రజలు..
కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పాస్ పుస్తకాలతో లోన్ లు కాజేస్తూ బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తీగలాగితే మరింత అవినీతి డొంక కదులుతుందని, అరెస్ట్ అయిన ముగ్గురే కాకుండా మరికొందరు పాత్రధారులు, సూత్రదారులు బయటకు వస్తారంటున్నారు ప్రజలు..
కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ..అక్రమవ్యవహారానికి సంబంధించిన వివరాలను మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు.
అరెస్ట్ అయిన వారి వివరాలు…
- A1. మూడ్ బాలాజీ S/o రాజు, వయస్సు: 35 సంవత్సరాలు, కులం: ST లంబాడా, Occ: వ్యవసాయం, R/o మచ్చ్యాతండా, కురవి 7897553300.
- A2. బానోత్ హరికిషన్ S/o చంద్రు, వయస్సు: 45 సంవత్సరాలు, కులం: ST లంబాడా, Occ: వ్యవసాయం, R/o కన్నతండా, అమనగల్, మహబూబాబాద్
- A3.బానోత్ వర్జన్ S/o దేవిసింగ్, వయస్సు: 36 సంవత్సరాలు, కులం: ST లంబాడ, Occ: వ్యవసాయం, R/o ఓట్లాపురం గ్రామం, జాఫర్ ఘడ్ మండలం,, 7989102257.
లోన్ కోసం బ్యాంక్ ల దగ్గరికి వెలితే కనీసం పట్టించుకోకుండా, సవాలక్ష కొర్రీలతో రాచిరంపాన పెట్టే బ్యాంకు సిబ్బంది తీరుతో విసిగి వేసారిపోయి ఇంక తమకు లోన్ రాదు, అంతో ఇంతో ఖర్చయినా సరే లోన్ ఇప్పించే వారుంటే బాగుండు అనే పరిస్థితి లో ఉన్నవారిని టార్గెట్ చేసుకున్న పై…ముగ్గురు నిందితులు మరికొందరి సహకారంతో నకిలీ పాస్ పుస్తకాల దందాకు తెరతీశారు. వీరు ముగ్గురు కలిసి కురవి మండలంలో కొంతమంది రైతులను మభ్యపెట్టి మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తాం అని దానికి ఖర్చు అవుతుంది అని చెప్పి, వారు ఒక్కో పాస్ బుక్ కి రూ.10,000 వసూళ్లు చేసి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. వ్యవహారం అంతా వాల్లే చూసుకునే ఒప్పందంతో నకిలీ పాస్ పుస్తకాల ద్వారా కురవి మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకు లో ఒకరికి, డోర్నకల్ యూనియన్ బ్యాంకు లో ఆరుగురికి, మహబూబాబాద్ యూనియన్ బ్యాంకులో ఒకరికి, మహబూబాబాద్ కెనరా బ్యాంకులో ముగ్గురికి ఇలా లోన్ లు గా రూ.16,90,000/- విలువ గల లోన్ లు ఇప్పించారు.
సదరు నిందితులు మరల కురవి యూనియన్ బ్యాంక్ లో మరికొంతమందికి అక్రమపద్దతిలో లోన్ లు ఇప్పించాలనే ఆలోచనతో కురవి మండల కేంద్రానికి కి వచ్చారు. మరికొంతమంది వ్యక్తులవి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి, వీటికి నకిలీ 1బి, ఈసి లు తయారు చేసే పనిలో ఉండగా పోలీసులు వీరిని పెట్టుకున్నారని డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు.
వీరిని అరెస్ట్ చేయకపోతే సుమారు ఒక కోటి రూపాయల వరకు బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇచ్చేవాళ్ళని డిఎస్పీ తిరుపతిరావు అన్నారు.
ఈ.ముఠాకు చెందిన మరికొంత మంది పరారీలో లో వున్నారని, ఈ..రకంగా ఏ..ఏ బ్యాంక్ ల నుండి ఎవరెవరు ఎంతెంత రుణాలు తీసుకున్నారో విచారణ జరుపుతామన్నారు.
ఎవరినీ ఉపేక్షీంచేది లేదని, ఇంకా ఈ..అక్రమ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందో కూడా తేలుస్తామని, ఎవరెవరు ఇలా లోన్ తీసుకున్నారో వారిని కూడా అరెస్ట్ చేస్తామని మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు.
వారి ముగ్గురి వద్దనుంచి 23 నకిలీ పాస్ పుస్తకాలు, ఒక లాప్ టాప్, ఒక కంప్యూటర్, రెండు ప్రింటర్ లు, మూడు సెల్ ఫోన్ లు సీజ్ చేసినట్లు డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు.
ఇదిలా ఉండగా కురవి యూనియన్ బ్యాంక్ లో ఒక కేసే వెలుగుచూసిందని, తీగలాగితే పదుల సంఖ్యలో నకిలీలలు, లక్షలాది రూపాయల అక్రమలోన్ ల పంపిణీ బయటపడుతుందని పులువురు గుసగుసలాడుతున్నారు. ఈ.. వ్యవహారంలో బ్యాంక్ లకు చెందిన సిబ్బంది సహకారం కూడా ఉండి ఉంటుందని ప్రజలు అంటున్నారు.
ఈ…ముగ్గురితో వదిలేయకుండా అక్రమార్కుల గుట్టు పూర్తిగా రట్టు చేయాలని పోలీస్ శాఖను ప్రజలు కోరుతున్నారు.
ఈ.విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ సర్వయ్య, కురవి ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు