భూపాలపల్లిలో దారుణం. క్షుద్రపూజలకు యువతి బలి?

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి కాటారం- భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని జిల్లాలోని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు.

ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నెల 6న చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో వర్షిణి కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. డెడ్‌బాడీ పక్కన ఆధార్‌ కార్డు లభించడంతో దాని ఆధారంగా వర్షిణిగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెడిపల్లి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్‌ వెళ్లి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం పక్కనే యువతి ఆధార్‌ కార్డు, కుంకుమ, నిమ్మకాయలు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటి ప్రకారం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అనే యువతిగా నిర్ధారించారు.

వర్షిణీ తండ్రి కుమారస్వామి రెండు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఆవేదనతో ఈ నెల 3న వర్షిణీ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి కవిత పలుచోట్ల ఆరా తీసి 6వ తేదీన చిట్యాల ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్‌ కేసుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్షీణీ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.

అనేక అనుమనాలు..

ఇంటినుంచి వెళ్లిపోయిన వర్షిణీ అనుమానస్పందంగా మృతి చెందడంపై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 3వ తేదిన ఇంటి నుంచివెళ్లిన వర్షిణీ ఇంతకాలం ఎక్కడ ఉందనే అనుమానాలు వస్తు్న్నాయి. ఆమెను ఎవరైనా నమ్మించి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అడవిలోకి ఎందుకొచ్చింది. హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా..? చంపి మృతదేహాన్ని పడేసి… ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.

యువతిని చంపి క్షుద్రపూజల వైపు దృష్టి మళ్లేలా చేశారా అనేది తేలాల్సి ఉంది.ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు, కాల్‌ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!