గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా విమాన కుప్పకూలగా, మృతుల సంఖ్య 274కు చేరింది. ఈ మేరకు అధికారులు తాజాగా ప్రకటించారు. వారిలో 241 మంది విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. మెడికోల వసతి గృహ సముదాయంలో ఉన్న కొందరు మరణించినట్లు చెప్పారు.
ఒక్కరు తప్ప అంతా సమాధి!
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొంతసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వసతి సముదాయం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్యాసింజర్లు, ఇద్దరు పైలట్లు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు తప్ప అంతా మరణించారు.
274కు చేరిన మృతుల సంఖ్య
అయితే విమానం కూలగా, బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం దాదాపు ధ్వంసమైంది. అంతులో 24 మంది మరణించరాని అధికారులు చెప్పగా, ఇప్పుడు ఆ సంఖ్య 33రి చేరిందని అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం విమానం కూలిన ఘటనలో 274 మంది చనిపోయినట్లు ప్రకటించారు.
మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు
మరోవైపు, విమాన ప్రమాదంపై మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనుంది కేంద్ర పౌరవిమానయాన శాఖ. ఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు జరగకుండా కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను కమిటీ ప్రతిపాదించనుందని తెలిపింది. కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని పేర్కొంది. ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది.
ప్రమాద స్థలికి AAIB అధికారులు
ఎయిరిండియా విమానం కూలిపోయిన ప్రదేశానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారులు చేరుకున్నారు. ప్రమాదస్థలిని పరిశీలించారు. మరోవైపు క్రాష్ సైట్‌లో ఛిన్నాభిన్నమైన విమానం అవశేషాలను అధికారులు పరిశీలించారు.