తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. “నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు.
కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు పోయినా రప్పించి మరీ.. అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కిసాబ్ మొత్తం చూస్తాం. ఊరుకునే బాపతి కాదు. “ఇదివరకు ఉన్న కథ వేరు.. ఇప్పుడున్న కథ వేరు.” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపుతూనే.. పోలీసులకు ఇన్‌డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.