కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలోని కాకతీయ కెనాల్ వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..వరంగల్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్లైయాష్ లోడ్ తో ఖమ్మం వెళుతున్న లారీ ఎదురెదుగా ఢీకొన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.
దీంతో రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ట్రాఫిక్ ను నియంత్రించారు.