సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు..

ఒకడు ఉండాలి వీడు వాడే..

సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు..

  • ప్రెస్ మీట్‌లో కల్వకుంట్ల కవిత బాంబులు
  • టార్చర్ చేసింది సంతోష్.. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు..
  • వీరు ఇద్దరు మేక వన్నె పులులు..
  • హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు
  • 750 కోట్ల విల్లా ఎక్కడిది తనికి?

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘సంతోష్ రావు దన దాహానికి అడ్డుఅదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్.. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి ఒకడు ఉండాలి వీడు వాడే.’ అంటూ కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

‘సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు షాట్. ఇది నాకు చెప్పింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి?. నవీన్ రావు ఎమ్మెల్సీకి పదవి ఎలా వచ్చింది.. సంతోష్ వాళ్ళ. హరీష్ రావు , సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ లతో కుమ్మక్కు అయి బిఆర్ఎస్ ఓడిపోయేలా చేశారు. చివరకు కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోయేలా చేశారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే, రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు. రాం అన్నకు చెప్తున్న.. నువ్వు కూడా హరీష్ రావు లాగా నేర్చుకో. కూతురిగా చెప్తున్న వీళ్ళను పార్టీలో ఉంచుకుంటే వీళ్లు మిమ్మల్ని కూడా మింగేస్తారు. వీరు ఇద్దరు మేక వన్నె పులులు.’ అంటూ కవిత, కేసీఆర్ మేనల్లుళ్లు అయిన హరీశ్ రావు, సంతోష్ రావు లపై ధ్వజమెత్తారు..

error: Content is protected !!