‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్ర‌ ను నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్లార‌ని విమ‌ర్శించారు.

రోజాపై ఇప్ప‌టికే అంత‌ర్గ‌త విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. ఆనాటి ఆడుదాం ఆంధ్ర‌ ద్వారా కొనుగోలు చేసిన ఆట వ‌స్తువుల్లో ఏమాత్రం నాణ్య‌త లేద‌న్న ర‌వినాయుడు.. వీటిని కొనేందుకు.. భారీ ఎత్తున ఖ‌ర్చు చూపించార‌ని.. ఆయా త‌యారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌ద్యం కుంభ‌కోణం ఎలా అయితే జ‌రిగిందో.. ఆడుదాం ఆంధ్ర‌లోనూ అలానే జ‌రిగింద‌ని ఆరోపించారు. రోజా ఇక‌, రోజులు లెక్క‌బెట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఎవ‌రెవ‌రికి ముడుపులు ఇచ్చారో.. ఎంతెంత దోచారో.. అంత‌ర్గ‌త విచార‌ణ సాగుతోంద‌ని.. ఇది ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని చెప్పారు.

మ‌రో 20 రోజుల్లోనే రోజాకు అరెస్టు వారెంటు ఇష్యూ అవుతుంద‌ని ర‌వినాయుడు తెలిపారు. క్రీడా మంత్రిగా ఆమె ప్ర‌జ‌ల సొమ్ము తో ఆడుకున్నార‌న్నారు. రోజా లాంటి వారు.. స‌మాజానికి, ప్ర‌జ‌ల‌కు కూడా భార‌మేన‌ని.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జైలుకు వెళ్లేం దుకు ఆమె రెడీగా ఉండాల‌న్నారు. ఆమెతోపాటు… సిద్ధార్థ్ రెడ్డి కూడా సిద్ధం కావాల‌ని ర‌వినాయుడు సూచించారు. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు. కానీ.. విచార‌ణ‌లో మాత్రం సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయ న్నారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ర‌వినాయుడు చెప్పారు.

లిక్క‌ర్‌కి.. దీనికి లింకేంటి?

వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని అధికారులు తేల్చి చెప్పారు. నాసిర‌కం మ‌ద్యాన్ని ఎక్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించి.. అలా వ‌చ్చిన ఎక్కువ సొమ్మును కంపెనీల నుంచి కోట్ల రూపాయ‌లు ముడుపులుగా పుచ్చుకున్నార‌న్న‌ది ఈ కేసు ప్ర‌ధాన సారాంశం. అలానే.. ర‌వినాయుడు చెప్పిన‌ట్టు ఆడుదాం ఆంధ్ర లో భాగంగా నాసిర‌కం క్రీడా వ‌స్తువులు ఎక్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి.. స‌ద‌రు కంపెనీల నుంచి మార్జిన్లు, క‌మీష‌న్ల‌ను రోజా, సిద్ధార్థ్ రెడ్డి పోగేసుకున్నార‌ని ఆయ‌న అంటున్నారు. దీనిపైనే ఇప్పుడు విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!