Post office Business opportunity: అనేకమంది ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడకుండా, తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి(Own Business) ప్రారంభించాలని ఉంటుంది. అలాంటి వారికోసం భారత తపాలా శాఖ (India Post) ‘అందిస్తున్న పోస్టాఫీస్ ఫ్రాంచైజీతో (Post Office Franchise)’ పథకం మంచి అవకాశంగా మారుతోంది. కేవలం ₹5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను అందిస్తూ ఆదాయం(Income) పొందే వీలుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత(Unemployed youth), చిన్న వ్యాపారులు(Small Traders), ఇప్పటికే కిరాణా, స్టేషనరీ(Grocery/Stationery) లేదా MeeSeva వంటి కేంద్రాలు నిర్వహిస్తున్న వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో లేదా ప్రతి కొత్త కాలనీలో పోస్టాఫీస్ ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడంతో, ప్రజలకు సేవలు చేరువ చేయడానికి భారత తపాలా శాఖ ఫ్రాంచైజీ(Franchise) విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో ఎంపికైన వ్యక్తి పోస్టాఫీస్ తరఫున స్పీడ్ పోస్ట్ (Speed Post), రిజిస్టర్డ్ పోస్ట్(Registered Post), స్టాంపుల విక్రయం(stamp Sale) వంటి అధికారిక సేవలను అందిస్తారు. దీంతో ప్రజలకు పోస్టల్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు, ఫ్రాంచైజీ నిర్వహించే వ్యక్తికి ప్రతి సేవపై కమిషన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వ సేవలను(Government Services) ప్రజలకు చేరవేస్తూనే స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగకరమైన అవకాశంగా చెప్పవచ్చు.
కావలసిన అర్హతలు – Eligibility
పోస్టాఫీస్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు కొన్ని ప్రాథమిక అర్హతలను(Basic Qualifications) పూర్తి చేసి ఉండాలి. ఈ నిబంధనలు సాధారణంగా చాలా సరళంగా ఉంటాయి కాబట్టి నిరుద్యోగ యువతతో(Unemployed Youth) పాటు చిన్న వ్యాపారులు(Small traders) కూడా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
– ముందుగా, దరఖాస్తుదారుడికి కనీసం 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి. ఈ పథకానికి గరిష్ట వయోపరిమితి లేదు, కాబట్టి అర్హతలు ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత(Educational Qualification) విషయానికి వస్తే, గుర్తింపు పొందిన పాఠశాల నుంచి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులు(10th Class Pass) అయి ఉండాలి. అయితే, కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ శాఖ అవసరాలను బట్టి 8వ తరగతి ఉత్తీర్ణుల దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
– ఈ ఫ్రాంచైజీకి వ్యక్తిగతంగా(Personally) ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారు, కిరాణా దుకాణాల యజమానులు(Grocery Shop Owners), పాన్ షాప్ నిర్వాహకులు(Pan Shop Oweners), కంప్యూటర్ సెంటర్ యజమానులు(Computer Center Owners), చిన్న వ్యాపారులు, అర్హత కలిగిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఇది అదనపు ఆదాయం పొందేందుకు మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది.
పెట్టుబడి మరియు ఆదాయం – Investment & Income
తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ భాగస్వామ్యంతో(Government Participation) స్వయం ఉపాధి ప్రారంభించాలని భావించే వారికి ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ స్కీమ్ మంచి అవకాశం. అర్హతలు, పెట్టుబడి, ఆదాయం వంటి ముఖ్యమైన వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
| అంశం | వివరాలు |
| స్కీమ్ పేరు (Name Of The Scheme) | ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ స్కీమ్ (Post Office Franchise) |
| కనీస వయస్సు (Minimum Age) | 18 సంవత్సరాలు |
| విద్యార్హత (Educational Qualification) | 10వ తరగతి (కొన్ని ప్రాంతాల్లో 8వ తరగతి కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు) |
| ఎవరు దరఖాస్తు చేయవచ్చు? | వ్యక్తులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, కిరాణా దుకాణదారులు, పాన్ షాప్ నిర్వాహకులు, కంప్యూటర్ సెంటర్ యజమానులు, సంస్థలు |
| సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) | ₹5,000 (NSC రూపంలో) |
| ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు (Infrastructure Cost) | సుమారు ₹1 లక్ష – ₹1.5 లక్షలు |
| ఆదాయం (Income) | కమిషన్ ఆధారంగా నెలకు సుమారు ₹20,000 – ₹80,000 వరకు (వ్యాపారాన్ని బట్టి) |
అందించే సేవలు – Services Offered
పోస్టాఫీస్ ఫ్రాంచైజీ కేంద్రంలో ప్రధానంగా కౌంటర్ సేవలు (Counter Services) మాత్రమే అందించాల్సి ఉంటుంది. పోస్టల్ వస్తువుల డెలివరీ(Delivery) బాధ్యత పూర్తిగా ఇండియా పోస్ట్దే. ఫ్రాంచైజీ ద్వారా అందించే ముఖ్యమైన సేవలు ఇవి:
- స్పీడ్ పోస్ట్ (Speed Post), రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ సేవలు.
- పోస్టల్ స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ విక్రయం.
- ఈ-మనీ ఆర్డర్ (eMO) బుకింగ్ సేవలు.
- పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) పాలసీల నమోదు, ప్రీమియం వసూలు.
- వివిధ బిల్లుల చెల్లింపులు మరియు ప్రభుత్వం అందించే ఈ-గవర్నెన్స్ సేవలు.
ఈ సేవలపై ఇండియా పోస్ట్ నిర్ణయించిన కమిషన్ లభిస్తుంది. సేవలు ఎక్కువగా అందించిన కొద్దీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
కమిషన్ ఎలా లభిస్తుంది – How Commission is Earned
పోస్టాఫీస్ ఫ్రాంచైజీలో నెలవారీ స్థిర జీతం ఉండదు. మీరు అందించే ప్రతి పోస్టల్ సేవపై ఇండియా పోస్ట్ నిర్ణయించిన కమిషన్ లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కమిషన్ వివరాలు ఇవి:
| సేవ | కమిషన్ |
|---|---|
| రిజిస్టర్డ్ పోస్ట్ (Registered Post) | ప్రతి బుకింగ్‌పై ₹3 |
| స్పీడ్ పోస్ట్ (Speed Post) | ప్రతి ఆర్టికల్‌పై ₹5 |
| ఈ-మనీ ఆర్డర్ (eMO) | విలువ ఆధారంగా ₹3.50 – ₹5 |
| పోస్టల్ స్టాంపులు & స్టేషనరీ విక్రయం | మొత్తం విక్రయాలపై 5% కమిషన్ |
| పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) | ప్రీమియం ప్రకారం ప్రత్యేక కమిషన్ |
దరఖాస్తు ఎలా చేయాలి – Apply Process
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా తమ జిల్లాలోని ప్రధాన పోస్టాఫీస్ (Head Post Office)ను సంప్రదించాలి. ఫ్రాంచైజీ ప్రారంభించే ముందు పోస్టల్ శాఖ అందించే మార్గదర్శకాలను(Guidelines) పూర్తిగా పాటించడం అవసరం. దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా ఈ దశలు ఉంటాయి:
- ఫ్రాంచైజీ దరఖాస్తు ఫారం పొందడం – Obtaining A Franchise Application Form
- ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించడం – Submission of Aadhar card, PAN card, Educational Qualification Certificates
- అవసరమైన పత్రాలతో దరఖాస్తు అందజేయడం – Submitting The Application with the Required Documents
- అధికారుల పరిశీలన అనంతరం ఎంపిక ప్రక్రియ – Selection Process After Scrutiny by Officials
- ఎంపికైన వారికి పోస్టల్ శాఖ నుంచి శిక్షణ – Training from the Postal Department for those Selected
Read Also: LPG Gas Cylinder Booking: గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. ఫోన్లోనే చిటికెలో బుక్ చేయండిలా!
తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ భాగస్వామ్యంతో స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి Post office Business (India Post Office Franchise) మంచి అవకాశం. సొంతగా బిజినెస్ చేయాలని ఆసక్తి ఉండి అర్హతలు కలిగి ఉన్నవారు అధికారిక నిబంధనలు(Official Rules), కమిషన్ విధానం(Procedure of Commission), దరఖాస్తు ప్రక్రియను గురించి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి
