దేశంలో బ్యాంకింగ్ సేవలు, ఆదాయపు పన్ను(Income Tax) రిటర్న్స్ దాఖలు, పెట్టుబడులు(Investments), ఆర్థిక లావాదేవీలు వంటి అనేక వసరాల కొరకు పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN Card) అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. ఒకసారి పాన్ కార్డ్‌లో పేరు, పుట్టిన తేదీ లేదా తండ్రి పేరు వంటి వివరాల్లో పొరపాట్లు(Mistakes) ఉంటే భవిష్యత్తులో బ్యాంకులు(Banks), ఫైనాన్షియల్ సంస్థలు(Financial Institutions), ప్రభుత్వ సేవల్లో(Government Services) ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
చాలామంది ఇదివరకే తమ పాన్ కార్డ్‌లోని తప్పులను సరిచేయాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆధార్ ఆధారిత e-KYC, e-Sign సౌకర్యంతో ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ వివరాలను మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంది. కొన్ని నిమిషాల్లో దరఖాస్తు పూర్తి చేసి, కొత్త పాన్ కార్డ్‌ను ఇంటికే పొందవచ్చు.
పాన్ కార్డ్‌లో ఏ వివరాలను మార్చుకోవచ్చు?
పాన్ కార్డ్‌లో అవసరమైతే పేరు లేదా స్పెల్లింగ్(Spelling), తండ్రి పేరు(Father Name), పుట్టిన తేదీ(Date of Brith), ఫోటో(Photo), సంతకం(Signature), చిరునామా(Address) , మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను సవరించుకోవచ్చు. అయితే ఈ మార్పులు తప్పనిసరిగా అధికారిక విధానంలో(Official Procedure)నే చేయాలి. దరఖాస్తు సమయంలో సరైన పత్రాలను సమర్పించి, నిజమైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలి. తప్పుడు లేదా అసంపూర్ణ వివరాలు అందిస్తే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది.
కరెక్షన్ కోసం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు.
దరఖాస్తు ప్రారంభించే ముందు ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుంది.
- ప్రస్తుత పాన్ కార్డ్ కాపీ (Current PAN Card Copy)
- ఆధార్ కార్డ్ (Aadhaar Card)
- పుట్టిన తేదీ మార్పు అవసరమైతే బర్త్ సర్టిఫికేట్ లేదా 10వ తరగతి మార్కుల మెమో (Birth certificate/10th class Marks Memo)
- పేరు మార్పు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ (అవసరమైతే) (Marriage certificate/Gazette Notification)
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ (Mobile number linked to Aadhaar)
ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ కరెక్షన్ ఎలా చేయాలి?
ప్రస్తుతం Protean (మునుపటి NSDL) లేదా UTIITSL ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంది. ఎక్కువ మంది ఉపయోగించే Protean పోర్టల్ ద్వారా చేసే విధానం ఇలా ఉంది.

– అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రారంభించండి: అధికారిక PAN సేవల పోర్టల్ PAN Services links Section లో “Address/Mobile number/Email ID update in PAN“ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పాన్ కార్డు నెంబరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా నమోదు చేసి Submit చేయాలి.
– టోకెన్ నంబర్‌ను భద్రపరచండి: దరఖాస్తు సమర్పించిన వెంటనే ఒక Token Number జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ఈమెయిల్‌కు కూడా వస్తుంది. ఒకవేళ మధ్యలో అప్లికేషన్ నిలిచిపోయినా అదే టోకెన్‌తో తిరిగి కొనసాగించే అవకాశం ఉంటుంది.
– e-KYC ద్వారా వివరాలు సవరించండి: తర్వాత Submit digitally through e-KYC & e-Sign (Paperless) అనే ఎంపికను సెలెక్ట్ చేయాలి. ఈ విధానానికి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి.
– ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఏ వివరాన్ని మార్చాలనుకుంటున్నారో ఆ వివరానికి ఎదురుగా ఉన్న Tick Box తప్పకుండా ఎంపిక చేయాలి. టిక్ చేయకుండా వివరాలు నమోదు చేస్తే ఆ మార్పు పరిగణనలోకి రాదు. ఆ తర్వాత ఆధార్ చివరి నాలుగు అంకెలు నమోదు చేసి వివరాలను ధృవీకరించాలి.
ఆఫ్‌లైన్ విధానం | Offline Process
మీకు ఆన్‌లైన్ పద్ధతులు కష్టంగా అనిపిస్తే, మీరు ఆఫ్‌లైన్ ద్వారా కూడా PAN Card Correction దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫారమ్ డౌన్‌లోడ్: ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ నుండి “Request for New PAN Card or/and Changes or Correction in PAN Data” ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫారమ్ నింపడం: ఫారమ్‌ను నల్లటి సిరా (Black Ink)తో మరియు BLOCK LETTERSలో మాత్రమే నింపండి.
- మార్పులు సూచించడం: మీరు ఏ వివరాలను మార్చాలనుకుంటున్నారో, ఆ ఫీల్డ్ పక్కన ఉన్న ఎడమ వైపు గడిని (Tick Box) మార్క్ చేయండి.
- సమర్పణ: నింపిన ఫారమ్, రెండు ఫోటోలు మరియు అవసరమైన డాక్యుమెంట్ల కాపీలతో సమీపంలోని TIN-ఫెసిలిటేషన్ సెంటర్ (TIN-FC) లేదా పాన్ సెంటర్‌లో సబ్మిట్ చేయండి.
ఫీజు ఎంత ఉంటుంది?
దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఫిజికల్ పాన్ కార్డ్ హోమ్ డెలివరీతో కలిపి సుమారు రూ.106 నుంచి రూ.110 వరకు ఫీజు ఉంటుంది. కేవలం e-PAN మాత్రమే కావాలనుకుంటే తక్కువ చార్జీలు ఉండొచ్చు. పేమెంట్‌ను ఈ విధానాల్లో చేయవచ్చు. UPI/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్
| దరఖాస్తు ప్రదేశం | ఫీజు (అంచనా) |
| భారతదేశంలో (Physical Card/e-PAN) | ₹106 నుండి ₹110 వరకు |
| విదేశాలలో (Physical Dispatch) | ₹959 నుండి ₹1,020 వరకు |
ఫీజు చెల్లించిన తర్వాత ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP నమోదు చేసిన తర్వాత e-Sign ప్రక్రియ పూర్తి చేయాలి. ఇదే మీ దరఖాస్తుకు డిజిటల్ సంతకంగా పరిగణించబడుతుంది.
అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
- దరఖాస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాత 15 అంకెల Acknowledgement Number లభిస్తుంది.
- ఈ నంబర్ ద్వారా అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.
- సాధారణంగా అన్ని వివరాలు సరిగా ఉంటే 7 నుంచి 15 పని దినాల్లో కొత్త పాన్ కార్డ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఫిజికల్ కార్డ్‌ను కొరియర్ ద్వారా పంపిస్తారు. e-PAN అయితే త్వరగా అందుబాటులోకి రావచ్చు.
ఆధార్ వివరాలు తప్పుగా ఉంటే ముందుగా ఏం చేయాలి?
చాలా సందర్భాల్లో పాన్ కార్డ్‌లో ఉన్న తప్పులు(Mistakes) అసలు ఆధార్‌లోని వివరాల వల్లే వస్తుంటాయి. పేరు లేదా పుట్టిన తేదీ ఆధార్‌లో తప్పుగా ఉంటే, ముందుగా ఆధార్(Aadhaar) వివరాలను సరిచేయడం మంచిది. అనంతరం అదే వివరాలతో పాన్ కార్డ్ కరెక్షన్‌కు దరఖాస్తు చేస్తే ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ఈ మార్పులు ఎందుకు ముఖ్యమైనవి?
పాన్ కార్డ్‌లోని వివరాలు సరైనవిగా ఉండటం ప్రస్తుతం చాలా అవసరం. ముఖ్యంగా,
- బ్యాంక్ ఖాతాలు తెరవడానికి – Open Bank Accounts
- లోన్లు పొందడానికి – To Get Loans
- ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి – To file Income Tax Returns
- మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి – To Invest in Mutual Funds and Shares
- KYC ధృవీకరణ పూర్తి చేయడానికి – To complete KYC verification
ఈ అన్ని సేవల్లో పాన్ కార్డ్‌లోని సమాచారం ఇతర అధికారిక పత్రాలతో సరిపోలాలి. చిన్న స్పెల్లింగ్ తప్పు కూడా కొన్నిసార్లు దరఖాస్తుల ఆలస్యానికి కారణం కావచ్చు.
పాన్ కార్డ్‌లో తప్పులు ఉన్నాయని గుర్తించిన వెంటనే వాటిని సరిచేయడం (correction) ఉత్తమం. ప్రస్తుతం ఆధార్ ఆధారిత డిజిటల్ సేవల వల్ల ఇంటి నుంచే సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సరైన వివరాలతో ఉన్న పాన్ కార్డ్ భవిష్యత్తులో బ్యాంకింగ్, ఆదాయపు పన్ను, పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక సేవల్లో(Financial service) ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుంది. దరఖాస్తు చేసేముందు అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని, అధికారిక పోర్టల్‌లో మాత్రమే ప్రక్రియ పూర్తి చేయడం సురక్షితమైన మార్గం.
