Home / Government Schemes / PMSBY Scheme: చిన్న ప్రీమియంతో భారీ రక్షణ.. రూ.2 లక్షల బీమా ఇలా పొందండి..

PMSBY Scheme: చిన్న ప్రీమియంతో భారీ రక్షణ.. రూ.2 లక్షల బీమా ఇలా పొందండి..

ఒక్కసారి ఆలోచించదగిన విషయం.. ఒక రోజులో ఒక టీ తాగడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ మొత్తంతో మీ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక భద్రత (Financial security) లభిస్తే ఎలా ఉంటుంది కదా? చాలా మంది బీమా పాలసీలు(Insurance Policies) ఖరీదు కూడుకున్నవిగా భావించి వాటికి దూరంగా ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం(Central Govt) అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bma YojanaPMSBY) ఆ అపోహను పూర్తిగా చెరిపేస్తోంది చెప్పవచ్చు. సంవత్సరానికి కేవలం ₹20 రూపాయల ప్రీమియంతో ప్రమాదవశాత్తు మరణం (Accidental death) లేదా శాశ్వత అంగవైకల్యం (Permanent Disability) సంభవించినప్పుడు రూ.2 లక్షల వరకు బీమా రక్షణ (Insurance Protection) అందించే ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. మీరు ఇంకా ఈ పథకంలో చేరకపోతే, అర్హతలు ఏమిటి, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా నమోదు చేసుకోవాలి, ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి.

ఈ పథకం ఇప్పుడు ఎందుకు ముఖ్యమైంది?

దేశంలో ఎక్కువ మంది కుటుంబాలు ఇప్పటికీ సరైన బీమా రక్షణ(Insurance Protection) లేకుండానే జీవిస్తున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ప్రైవేట్ బీమా పాలసీలు (Private insurance policies) కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి చాలా తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా (Accident Insurance With Low Premium) అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. సంవత్సరానికి కేవలం ₹20 చెల్లించి కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కల్పించుకోవడం పెద్ద ప్రయోజనంగా చెప్పవచ్చు.

ఈ పథకం ముఖ్యాంశాలు – Highlights Of The Scheme

అంశంవివరాలు
పథకం పేరు (Scheme Name)ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana – PMSBY)
వార్షిక ప్రీమియం (Annual Premium)₹20
వయస్సు (Age)18 నుండి 70 సంవత్సరాలు
ప్రమాద మరణం (Accidental Death)₹2 లక్షలు
పూర్తి శాశ్వత అంగవైకల్యం (Total Permanent Disability)₹2 లక్షలు
పాక్షిక అంగవైకల్యం (Partial Paralysis)₹1 లక్ష
పాలసీ కాలం (Policy Period)ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు
చెల్లింపు (Payment)బ్యాంకు ఖాతా ద్వారా ఆటో డెబిట్

ఎవరు ఈ పథకంలో చేరవచ్చు?

ఈ బీమా పథకంలో చేరేందుకు పెద్దగా షరతులు అంటూ ఏమీ లేవు. ఇందులో చేరడానికి కావలసిన అర్హతలు.

  • భారతీయ పౌరుడు అయి ఉండాలి – Must be an Indian citizen.
  • వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి – Age Should be Between 18 and 70 years.
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి – Must have a Savings Bank Account.
  • బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసి ఉండటం మంచిది – Link Aadhaar to Bank Account
  • ఆటో డెబిట్‌కు అంగీకరించాలి – You must Agree to Auto Debit.
  • ఒక వ్యక్తి ఒక్క బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఈ బీమా పొందవచ్చు – An Individual can Avail this Insurance Through only one Bank Account.

ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు..

ఎవరైతే ఈ బీమా పథకం తీసుకుంటారో వారికి ఈ మూడు రకాల రక్షణ లభిస్తుంది.

  • ప్రమాదంలో మరణించినట్లయితే నామినీ(Nominee) కి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
  • రెండు కళ్లు లేదా రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయినా లేదా పూర్తిగా పని చేయలేని పరిస్థితి వచ్చినా రూ.2 లక్షలు అందుతాయి.
  • ఒక కన్ను లేదా ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే రూ.1 లక్ష బీమా మొత్తం చెల్లిస్తారు.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు..

ఈ పథకంలో చేరేందుకు సాధారణంగా ఈ వివరాలు అవసరం అవుతాయి.

  • ఆధార్ కార్డు (Aadhaar card)
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (Savings Bank Account)
  • మొబైల్ నంబర్ (Mobile Number)
  • నామినీ వివరాలు (Details of Nominee)
  • బ్యాంక్ కోరిన దరఖాస్తు ఫారం (Application Form)

Application For PMSBY Scheme

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) లో చేరడం చాలా సులభం. మీకు అనుకూలంగా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో(Offline) దరఖాస్తు చేయాలంటే, మీ బ్యాంక్ బ్రాంచ్‌(Bank Branch)ను సందర్శించి PMSBY దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అవసరమైన వ్యక్తిగత వివరాలు(Personal Details), నామినీ సమాచారం(Nominee Information) నమోదు చేసి, ప్రీమియం మొత్తం ఆటో డెబిట్(Auto Debit) అయ్యేలా అనుమతి ఇవ్వాలి. అనంతరం ఫారాన్ని బ్యాంకులో సమర్పిస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

ఆన్‌లైన్‌లో(Online) అయితే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ (Net banking/Mobile Banking) ద్వారా ఈ సేవను అందిస్తున్నాయి. మీ ఖాతాలో లాగిన్ అయ్యి Insurance లేదా Social Security Schemes విభాగంలో PMSBY ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత ఆటో డెబిట్‌కు అంగీకరించి వివరాలను నిర్ధారిస్తే నమోదు పూర్తవుతుంది.

– దరఖాస్తు విజయవంతంగా పూర్తయి, ప్రీమియం (Premium) బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అయిన తర్వాత పాలసీ (Policy) అమల్లోకి వస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ చెల్లుబాటు అవుతుంది. ఆటో డెబిట్ కొనసాగితే ప్రతి ఏడాది పాలసీ ఆటోమేటిక్‌గా రిన్యూ అవుతుంది.

PMSBY క్లెయిమ్ ఎలా చేయాలి?

ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత త్వరగా సంబంధిత (Related) బ్యాంక్ బ్రాంచ్‌లో PMSBY క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాలి. క్లెయిమ్ ప్రక్రియలో బ్యాంక్ సూచించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా క్లెయిమ్ దరఖాస్తు ఫారం(Claim Application Form), అవసరమైతే FIR, వైద్య ధ్రువీకరణ పత్రాలు, మరణం సంభవించినట్లయితే డెత్ సర్టిఫికేట్(Death certificate), అవసరమైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్(Postmortem report), అలాగే నామినీ గుర్తింపు పత్రాలు (Nominee Identification Documents) సమర్పించాలి. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం క్లెయిమ్‌ను ఆమోదించి బీమా మొత్తాన్ని విడుదల చేస్తారు.

Read Also: IRCTC Authorized Agent అవ్వండి.. నెలకు రూ. 30 వేల వరకు సంపాదించండి!

అధికారిక సమాచారం ఎక్కడ చూడాలి?

ఈ పథకం గురించి తాజా వివరాలు, అర్హతలు, క్లెయిమ్ విధానం మరియు మార్గదర్శకాల కోసం జన సురక్ష అధికారిక పోర్టల్ (Jana Suraksha Official portal), మీ బ్యాంక్ లేదా సంబంధిత ప్రభుత్వ సంస్థ విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిశీలించడం మంచిది.

ప్రతి కుటుంబానికి కనీస బీమా రక్షణ ఉండటం ఈ రోజుల్లో అవసరంగా మారింది. అలాంటి సమయంలో సంవత్సరానికి కేవలం ₹20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా అందించే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన – PMSBY ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వ పథకం. ముఖ్యంగా బీమా సౌకర్యం లేని కుటుంబాలు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ అవకాశాన్ని పరిశీలించడం మంచిది. ఒక చిన్న ప్రీమియం భవిష్యత్తులో కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసాగా నిలిచే అవకాశం ఉంది.

Tagged:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *