గుంటూరు జిల్లా తాడేపల్లి : విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్…
వచ్చే పోయే వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిలు…
గంజాయి మద్యం సేవించి కొంతమంది యువకులు హల్చల్ చేస్తూ లారీ పార్కింగ్ చేసి ఉంటే లారీ చాటున దాక్కుని అరుపులు కేకలు పెడుతూ వచ్చే పోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు…
ఏ క్షణన్న ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వృత్తిరీత్యా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వృత్తి అయిపోయిన తర్వాత అర్ధరాత్రి నివాసానికి చేరుకోవాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు…
ఇక పాదాచారులు సంగతి చెప్పనవసరం లేదు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ రోడ్లో నడవాల్సిన పరిస్థితి…
దయచేసి పోలీసు వారు ఈ రోడ్లో బీట్ నిర్వహించవలసిందిగా స్థానికులు కోరుచున్నారు…