రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. “ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు.