తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని చెప్పారు. ఇవాళ(మంగళవారం) హనుమకొండలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో మంత్రులు పాల్గొన్నారు. దేవాదుల ఫేస్-3 పంప్‌హౌస్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించడానికి వచ్చారు.