వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే.. తేల్చిన అధికారులు వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. గుర్రాల కొండపై కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు.
అయితే గతం లో తనపై ప్రభుత్వ భూమి కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టాడు అని ఆరోపణలు ఉండే గెస్ట్‌హౌస్ నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని కుటుంబసభ్యుల పేరుతో రిజిస్టర్ చేసినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి వీఆర్‌వోలు వెళ్లగా.. కొండపైకి వెళ్లే మార్గంలో గేటు వేసి ఉండడంతో వీఆర్‌వోలు వెనుదిరిగారు.