వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం

  • నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో వెలుగులోకి వచ్చిన ఘటన
  • గందరగోళం సృష్టించడానికే వదంతుల ప్రచారం: పాఠశాల విద్య డైరెక్టర్
  • మంచిర్యాలలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం
  • రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పరీక్షలు షురూ.. 99.67 శాతం హాజరు

పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్లో ప్రశ్న పత్రం చక్కర్లు కొట్టిన విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గందరగోళం సృష్టించడానికే వదంతులు ప్రచారం చేశారన్నారు. వికారాబాద్, తాండూర్లలో సంస్కృతం పేపర్కు బదులుగా తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. అయితే దీనిని ఆలస్యంగా గుర్తించి అధికారులు మళ్లీ సం స్కృతం పేపర్ ఇచ్చి పరీక్ష రాయించారు. మంచి ర్యాలలోనూ తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు రెండు గంటలు

ఆలస్యంగా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలే దని, ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీ క్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.

45 నిమిషాల పాటు పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష ముగింపు సమయం గడిచినా, 45 నిమిషాల వరకు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించలేదు. లీకైన పేపర్ ఫొటోతో పరీక్ష కేం ద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలతో సరి పోల్చి చూశారు. లీకైన పేపర్ సీరియల్ నంబరుతో

మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్


సీరియల్ నంబర్లతో పోల్చి చూశారు. లీకైన టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం సీరియల్ నంబరు 1495550గా అధికారులు గుర్తించారు. విచారణ తర్వాత మధ్యా హ్నం 1:15 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. సీరియల్ నం బరు వేరుగా ఉన్నా, అందులోని ప్రశ్నలకు, విద్యార్థులకు అందజేసిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్న లకు మధ్య తేడా ఏమీ లేదని అధికారులు గుర్తిం చినట్టు తెలిసింది.

సంస్కృతం బదులు తెలుగు పేపర్


వికారాబాద్ జిల్లా తాండూరులోని టీజీఎస్ఆర్ బాలి కల గురుకులానికి చెందిన టెన్త్ విద్యార్థి నాగలక్ష్మితో పాటు మరో విద్యార్థి పట్టణంలోని శివసాగర్ కేం. ద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. అయితే తమకు సంస్కృతం ప్రశ్నపత్రానికి బదులు తెలుగు ప్రశ్న పత్రం ఇచ్చారని చెప్పినా, ఇదే మీ పేపర్ అంటూ ఆ విద్యార్థులతో బలవంతంగా పరీక్ష రాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!