వచ్చే నెలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె?


తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాం డ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధి కార యాజమాన్యం నిర్ల క్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమ వుతోంది.ఆర్టీసీ యాజ మాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముం దుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు….

లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపే అవకాశం కల్పించి నా, ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొనకపోవ డంతో చర్చలు జరగకుం డానే RTC JAC నేతలు వెనుదిరిగారు. ఇది ఉద్యో గులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ, తమ వాదనలకు మద్దతు గా చర్యలు తీసుకోకపోవ డం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపు తున్న యాజమాన్యం, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నుండి తప్పించుకుంటోందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఆర్టీసీ ఉద్యోగు లకు ఇచ్చిన హామీల అమలులో పురోగతిలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా పడని పరిస్థితి నెలకొంది. విలీన ప్రక్రియ గురించి ఎటువంటి ప్రకటన లేకుండా, ప్రభు త్వం చురుగ్గా వ్యవహరిం చకపోవడం పట్ల తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పైగా పెండింగ్ బిల్లుల గురిం చి కూడా ఎవరూ స్పందించ కపోవడంతో సమస్యలు మరింత పెరిగినట్లయ్యిం ది.ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో పాటు, RTC బస్సులను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయాలని, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని, విలీన ప్రక్రియను పూర్తిచేయాలని RTC JAC నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇవేవీ పరిష్కారం కాదనే అభిప్రాయంతో, వచ్చే నెల 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావలసిన అవసరం ఉందని, లేదంటే ఆర్టీసీ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని కార్మి కులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!