మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు.
ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించినట్లు చెబుతున్నప్పటికీ గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర డిజీస్‌లు కూడా ఆయనకు సోనినట్లు సమాచారం.