భర్త వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 4 నెలలకే యువతి ఆత్మహత్య
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో.. భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
భోలక్ పూర్ కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరిష్ యాదవ్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని చెప్పకుండా పెళ్లి చేశారని… ఈ విషయం చెప్పనందుకు అదనపు కట్నం, బంగారం తీసుకురావాలని భర్త, అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేశారు