భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీ కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఆ తర్వాత ఆ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
తరచుగా ఏదో ఒక విషయం మీద గొడవలు పడుతూనే ఉన్నారు. మార్చి 20వ తేదీన కూడా వీరిద్ధరి మధ్యా గొడవ జరిగింది. ఈ సారి గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా తయారైంది. ఇద్దరూ కలబడి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే రవీనా భర్త నాలుకను కొరికేసింది. నాలుక రెండుగా తెగి కిందపడటంతో కన్హయ్యాలాల్ అల్లాడిపోయాడు. గట్టిగా అరుస్తూ ఏడవ సాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.