కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడంలో పొన్నం ప్రభాకర్ ముఖ్య భూమిక పోషించారని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఎంపీగా ఉద్యమించి నేడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి, రెండూ గంగుల కమలాకర్ కు లేవని పురుమల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.

బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 11405 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గత సంవత్సరం 9200 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింవులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే పనిలో ఉందని ఆయన వివరించారు.
బీసీ సామాజికవర్గానికి మేలు జరగాలనే ఏకైక లక్ష్యంగా కులగణన సర్వేను, బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడంలో పొన్నం ప్రభాకర్ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. మంత్రి గా ఐదేళ్ళు ఉన్న గంగుల కమలాకర్ ఏనాడైనా తన శాఖ గురించి మాట్లాడారా అని నిలదీశారు. బీసీల కోసం నిరంతరం తపించే పొన్నం ప్రభాకర్ ను విమర్శిస్తే సూర్యునిపై ఉమ్మేసినట్లే అవుతుందని ఆయన తేల్చిచెప్పారు.