ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకు న్నాయి. వరుసగా రెండో రోజు జరిగిన విచారణలో భాగంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ బెంచ్ ఎదుట స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. ఈ కేసులో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవటం పైన సుప్రీం కీలక అంశాలను ప్రస్తావన చేసింది.
మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి అని సింఘ్విని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సుప్రీం ర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతోందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
ఈ రోజు విచారణలో ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని, స్పీకర్ తర పున కూడా చెపుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయవాది ప్రస్తావించారు.
అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారని న్యాయవాది అన్నారు. దీంతో ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.