ఇందిరమ్మ ఇండ్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి, బానిసలా ఉండాలని మహిళా పంచాయతీ కార్యదర్శిని వేధించిన కాంగ్రెస్ నాయకులు
వారి వేధింపులు తాళలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దళిత మహిళా పంచాయతీ కార్యదర్శి
మేము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు
మేం చెప్పినట్లే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్ లో పంపి వెళ్ళిపోయాను
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఆవేదన వ్యక్తం చేసిన పంచాయతీ కార్యదర్శి
నేను బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శిగా 20నెలల నుంచి పనిచేస్తున్న.. గ్రామంలో కోదాది మల్లేశ్, గుగ్గిల్ల శ్రీకాంత్, అభిగౌడ్, కొమిరె రాజు తాము చెప్పినట్టే నేను వినాలని నన్ను వేధించేవారు
ప్రతి సమావేశానికి ముందు వారికి ఫోన్ చేసి చెప్పాలనేవారు.. రేపు సర్పంచ్ ఆయ్యేది మేమే.. ఏమున్నా మాకు చెప్పాలి.. మాకు అనుకూలంగా పనిచెయ్యాలని.. ఆఖరికి నేను వెళ్లిపోయే రోజు కూడా వేధించారు
ఏడాది నుంచి ఎంతో వేదన భరించాను.. పైఅధికారులకు ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నా వారు మద్దతివ్వలేదు. మూడుసార్లు కలెక్టర్ను కలిసిన కూడా ఫలితం లేకపోయింది
ఒత్తిడి భరించలేక ఇల్లు విడిచి వెళ్లామని నిర్ణయించుకుని తిరుపతికి వెళ్లిపోయా. మా వాళ్లు ట్రేస్ చేసి తీసుకువచ్చారని ఆవేదం వ్యక్తం చేసిన పంచాయతీ కార్యదర్శి ప్రియాంక